చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎక్కడా గెలవలేరు: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎక్కడా గెలవలేరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లిలో ఎక్కడ్నించైనా పోటీ చేయాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. కుప్పంలో పోటీచేసినా చంద్రబాబు ఓడిపోతారని అన్నారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానేమో అని వ్యాఖ్యానించారు.

ఇక, జడ్జి రామకృష్ణ ఎవరో తనకు తెలియదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రామకృష్ణపై నేను దాడులు చేయిస్తున్నట్టు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తంబళ్లపల్లిలో టీడీపీ నేతలపై దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. పర్సంటేజీలు తీసుకుని పనిచేయని శంకర్ యాదవ్ పై టీడీపీ నేతలు నల్లారి కిశోర్, శ్రీనివాసులురెడ్డి దాడులు చేశారని తెలిపారు.

Peddireddi Ramachandra Reddy
Chandrababu
Chittoor District
Judge Ramakrishna

More Telugu News